- ఎస్పీ సునీతారెడ్డి
పాన్గల్, వెలుగు : వివిధ కేసుల్లో సీజ్ చేసి వెహికల్స్ను నిర్లక్ష్యం చేయొద్దని, అవి కేసులో కీలకపాత్ర పోషిస్తాయని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. మంగళవారం పోలిస్స్టేషన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలిస్టేషన్లోని రికార్డులు, సీజ్చేసిన వాహనాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు కేవలం నేరస్తుడిని పట్టుకోవడంలోనే కాకుండా కేసులకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను సమగ్రంగా విచారణ చేయాలని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఆయన వెంట ఎస్సై శ్రీనువాసులు, సిబ్బంది ఉన్నారు.
