అంబేద్కర్ స్పూర్తితో నే తెలంగాణ సాధించుకున్నాం 

అంబేద్కర్ స్పూర్తితో నే తెలంగాణ సాధించుకున్నాం 

భారత రాజ్యాంగ నిర్మాత  డాక్టర్  బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో నే తెలంగాణ సాదించుకున్నామన్నారు  స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆయన చాలా గొప్ప రాజ్యాంగాన్ని దేశానికి అందించారన్నారు. అంబేద్కర్‌ 130వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించిన పోచారం.. 130 ఏళ్ళు గడిచిన ఆయన మన మద్యే ఉన్నట్టు అన్పిస్తోందన్నారు. చిన్న రాష్ట్రలతోనే అభివృద్ధి బాగా జరుతుందని అంబేద్కర్ సూచించారన్నారు.
 
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు మంచి ఫలాలు అందుతున్నాయన్నారు పోచారం. దళిత, గిరిజన, వెనుకబడిన మైనార్టీ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. రాజకీయాలు అంటే ఒకరిని ఒకరు తిట్టుకోవడం,విమర్శలు చేసుకోవడం కాదు..ప్రజల కోసం పని చేయాలని సూచించారు. రాజకీయం అంటే వ్యాపారం కాదుని.. పార్టీలకు అతీతంగా దేశ,రాష్ట్ర ప్రగతికి పునరంకితం కావాలన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.