ఏం తమాషాలు చేస్తున్నరా?.పని చేతకాకపోతే ఇంటికెళ్లండి

ఏం తమాషాలు చేస్తున్నరా?.పని చేతకాకపోతే ఇంటికెళ్లండి

వర్ని, వెలుగు: ఆర్ డబ్ల్యూఎస్, ట్రాన్స్​కో ఆఫీసర్లపై స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి ఫైర్ ​అయ్యారు. ‘పల్లె ప్రగతి’లో భాగంగా శుక్రవారం ఆయన నిజామాబాద్​జిల్లా వర్ని మండలం జాకోరా, జలాల్​పూర్ గ్రామాల్లో పర్యటించారు. జాకోరాలో నిర్వహించిన కార్యక్రమంలో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా? కరెంటు సప్లై ఎలాగుంది? రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని స్పీకర్​గ్రామస్తులను అడిగారు. వాటర్​సప్లై సక్రమంగా లేదని, పంట పొలాల్లో విద్యుత్‌‌‌‌ వైర్లు కిందికి వేలాడుతున్నాయని, రైతు వేదికలకు కరెంటు సప్లై ఇవ్వమంటే ఆఫీసర్లు ఏదోదో కారణాలు చెబుతున్నారని రైతులు, లీడర్లు చెప్పారు. స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ..  ‘ఏం తమాషాలు చేస్తున్నరా.. పనులు చేయకుండా నాటకాలాడుతున్నరా.. చేతకాకపోతే ఇంటికెళ్లండని ఆర్‌‌‌‌డబ్ల్యూఎస్‌‌(రూరల్ వాటర్​సప్లై)‌‌, ట్రాన్స్‌‌‌‌కో ఆఫీసర్లపై ఫైర్​అయ్యారు. బోధన్‌‌‌‌ డివిజన్ లో ట్రాన్స్‌‌‌‌కో పనితీరు వరెస్టుగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు మీకు పట్టవా అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి తాగునీరు, రైతుకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని చెప్పారు. జాకోరా, చందూరులో ఏర్పాటు చేసిన లిఫ్టుల ప్రారంభోత్సవానికి సీఎం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌‌‌‌ పోచారం భాస్కర్‌‌‌‌రెడ్డి, వర్ని జడ్పీటీసీ హరిదాసు, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, ఏఎంసీ చైర్మన్‌‌‌‌ సంజీవ్‌‌‌‌, జాకోరా విండో చైర్మన్‌‌‌‌ కృష్ణారెడ్డి, ఆర్డీఓ రాజేశ్వర్‌‌‌‌, తహసీల్దార్‌‌‌‌ విఠల్​తదితరులు పాల్గొన్నారు.