రాయిటర్స్ తో సహా ఆ 2 వేల ఖాతాలను బ్లాక్ చేయండి:ఎక్స్ (X)కు మోదీ సర్కార్ ఆదేశం

రాయిటర్స్ తో సహా ఆ 2 వేల ఖాతాలను బ్లాక్ చేయండి:ఎక్స్ (X)కు మోదీ సర్కార్ ఆదేశం

భారతదేశంలో మీడియా స్వేచ్ఛ..సోషల్ మీడియా హ్యాండిల్స్పై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. రాయిటర్స్తో సహా 2 వేల355 X(ట్విట్టర్) ఖాతాలను ఇండియాలో బ్లాక్ చేయాలని ఆదేశిస్తూ..ఆ కంపెనీని ఆదేశించింది మోదీ సర్కార్. ఈ విషయాన్ని ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ ప్రకటించటం సంచలనంగా మారింది. 2025, జూలై 3వ తేదీనే ఈ మేరకు భారత ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని ప్రకటించటం ఇప్పుడు కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మోడీ ప్రభుత్వం రాయిటర్స్‌తో సహా 2000కి పైగా X (గతంలో ట్విట్టర్) ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.  జూలై 6, 2025న అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రధాన X ఖాతా Reuters World తో సహా భారత్ లో నిలిపివేశారు. చట్టపరమైన డిమాండ్ గా భారత ప్రభుత్వం కోరడం వల్లే ఈ చర్య తీసుకున్నట్లు X ప్లాట్‌ఫాం తెలిపింది. ఈ సంఘటన భారత ప్రభుత్వం ,సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల మధ్య కంటెంట్ నియంత్రణకు సంబంధించి కొనసాగుతున్న సంక్లిష్టతను హైలైట్ చేసింది. 

జూలై 3 2025న భారత ప్రభుత్వం సెక్షన్ 69A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద రాయిటర్స్‌తో సహా 2,355 ఖాతాలను భారత్ లో బ్లాక్ చేయాలని Xకి ఆదేశించిందని X తన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని లేకుండా క్రిమినల్ చర్యలు తప్పవని ఒక గంటలోపు తక్షణ చర్య తీసుకోవాలని తదుపరి నోటీసు వచ్చే వరకు ఖాతాలను బ్లాక్ చేయాలని ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసిందని X తెలిపింది. అయితే ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత తర్వాత @Reuters ,@ReutersWorld ఖాతాలను అన్‌బ్లాక్ చేయమని ప్రభుత్వం Xని అభ్యర్థించిందని కూడా X వెల్లడించింది.

►ALSO READ | అకౌంట్లు బ్లాక్ చేయమని ఆదేశించలేదు: X ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్

అయితే భారత ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది. రాయిటర్స్ ఖాతాను నిలిపివేయాలని తాము ఎటువంటి చట్టపరమైన ఆదేశాలు జారీ చేయలేదని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. కమ్యూనికేషన్ సమస్య కారణంగా ఇది జరిగిందని ఈ సమస్యను పరిష్కరించడానికి X తో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. 

పాత ఆర్డర్స్ ప్రస్తుతం అమలు?..

అధికారిక వర్గాల ప్రకారం.. ఆపరేషన్ సింధూర్ సమయంలో (మే 7, 2025న) రాయిటర్స్ X ఖాతాతో పాటు వందలాది ఇతర ఖాతాలను భారత్ లో బ్లాక్ చేయాలని Xకి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే అప్పట్లో X ఈ ఆర్డర్లను అమలు చేయలేదు. ఇప్పుడు X ఆ పాత ఆదేశాలను పొరపాటుగా అమలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమస్య ప్రస్తుతానికి సంబంధం లేదని, బ్లాకింగ్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వం Xని కోరినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతానికి రాయిటర్స్ ప్రధాన X ఖాతా భారత్ లో పునరుద్దరించారు. ప్రభుత్వ జోక్యం తర్వాత X దీనిని పునరుద్దరించినట్లు తెలుస్తోంది.