మంథని, వెలుగు: మంథని నుంచి మేడారం జాతరకు స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు అసిస్టెంట్ మేనేజర్ ఏంజెల్ తెలిపారు. ఆదివారం మంథని బస్టాండ్‌లో మేడారం బస్సులను ఆర్టీసీ అధికారులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ముందస్తు దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఈ బస్సులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈనెల 27 నుంచి కౌంటర్లు ప్రారంభిస్తామన్నారు. ఈ బస్సుల్లో పెద్దలకు రూ350, పిల్లలకు రూ.210 చార్జీలు ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వియోగం చేసుకోవాలని కోరారు.
