కరోనాపై గెలిచేదాకా యుద్ధమే

కరోనాపై గెలిచేదాకా యుద్ధమే

కరోనా కట్టడికి ఐదు కమిటీలు నియమించిన రాష్ర్ట సర్కారు

మానిటరింగ్​కు మంత్రి ఈటల ఆధ్వర్యంలో హై లెవల్ కమిటీ

కోఠిలో కరోనా కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. డైలీ అక్కడ మీటింగ్స్

గాంధీని సందర్శించిన ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడీసీ, డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టడికి రాష్ర్ట ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నేషనల్ హెల్త్ మిషన్ ఆఫీసర్లు, వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, డాక్టర్లతో ఐదు కమిటీలను వేసింది. ఈ కమిటీలను మానిటర్ చేసేందుకు ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లోని ప్రతి ఒక్కరూ రోజూ ఉదయం 10 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. ముందు రోజు తీసుకున్న నిర్ణయాల అమలు, ఆ రోజు చేయాల్సిన పనులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ కమిటీలతో కలిసి కరోనా నివారణ కోసం పని చేసేందుకు ఒక్కో జిల్లా నుంచి పది మంది పారామెడికల్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చొప్పున హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలిపించారు. వీళ్లంతా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పని చేయనున్నారు. కోఠిలో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీరితో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, మంత్రి ఈటల సమావేశం నిర్వహించారు. కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పుకార్లను తిప్పికొట్టాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్నందున అదనపు వేతనం, ప్రశంసా పత్రాలు ఇస్తామని ఆయన ప్రకటించారు.

ప్రైవేటు హాస్పిటళ్లకు గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కరోనా అనుమానితులను అడ్మిట్ చేసుకునేందుకు ప్రైవేటు హాస్పిటళ్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. గురువారం వారితో సమావేశం నిర్వహించింది. మంత్రి ఈటల, డీఎంఈ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరావు సహా పలువురు ఆఫీసర్లు ఈ మీటింగ్​లో పాల్గొన్నారు. కరోనా పేరిట ఎవరినీ ఆందోళనకు గురి చేయొద్దని సూచించారు. గైడ్​లైన్స్​విడుదల చేశారు. ‘‘కరోనా అనుమానితులకు ప్రత్యేకంగా ఓపీ నిర్వహించాలి. కరోనా లక్షణాలు ఉండి, ట్రావెల్ హిస్టరీ ఉన్నోళ్లను, వాళ్లతో కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నోళ్లనే ఐసోలేట్ చేయాలి. ఆ వార్డుల్లో పనిచేసే డాక్టర్లకు, స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు, అవసరమైన ప్రొటెక్షన్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందజేయాలి. అనుమానితుల వివరాలను గాంధీ నోడల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందజేయాలి. శాంపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేకరించి గాంధీ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరవేయాలి. పాజిటివ్ వస్తే, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇవ్వాలి. ప్రభుత్వం చెప్పినంత డబ్బులే పేషెంట్ వద్ద తీసుకోవాలి” అని పేర్కొన్నారు.

కేరళకు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కేరళలో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలను స్టడీ చేసేందుకు జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి.సంతోష్ నేతృత్వంలోని 12 మంది ఆఫీసర్ల బృందం గురువారం కేరళకు వెళ్లింది. అక్కడి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులు, హాస్పిటళ్లలో కరోనా స్ర్కీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ టీమ్ పరిశీలించనుంది. త్రివేండ్రం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా, ఇతర దవాఖాన్లలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్డులను చూస్తుంది. ఈనెల 8న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరిగి వస్తుంది. మరోవైపు శుక్రవారం ఢిల్లీకి ఇంకో టీమ్ వెళ్లనుంది. సెంట్రల్ హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ నిర్వహించే సమావేశంలో పాల్గొంటుంది.

నేడు కలెక్టర్లతో సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీక్ష

కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, మెడికల్, హెల్త్ ఆఫీసర్లతో సీఎస్ సోమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

ఇద్దరిపై కేసులు నమోదు

కరోనాపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేసిన ఓ ఐటీ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై, తమ వద్ద ఉన్న మందులతో కరోనా నయం చేస్తామంటూ ఓ టీవీ చానల్ డిబేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడిన హోమియో వైద్యునిపై ఆరోగ్యశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసులు నమోదు చేశారు.