కొవిడ్‌ – 19 హెల్పర్స్‌కు గూగుల్‌ థ్యాంక్స్‌ నోట్‌

కొవిడ్‌ – 19 హెల్పర్స్‌కు గూగుల్‌ థ్యాంక్స్‌ నోట్‌
  • స్పెషల్‌ డూడుల్‌తో థ్యాంక్స్‌ చెప్పిన గూగుల్‌
  •  రెండు వారాల క్రితం డూడుల్‌ సిరీస్‌ ప్రారంభం

కాలిఫోర్నియా: కరోనాను అరికట్టేందుకు పోరాడుతూ, లాక్‌డౌన్‌ వేళ ప్రజలకు ఇబ్బందులు లేకుండా హెల్ప్‌ చేస్తున్న వారికి గూగుల్ థ్యాంక్స్‌ చెప్పింది. రెండు వారాలుగా వివిధ రంగాల వారిపై ప్రత్యేక డూడుల్‌ పెడుతూ.. డూడుల్‌ సిరీస్‌ రన్‌ చేసిన గూగుల్‌ శనివారం థ్యాంక్స్‌ నోట్‌ చెప్తూ స్పెషల్‌ డూడుల్‌ను డిస్‌ప్లే చేసింది. కరోనాతో పోరాడుతున్న అన్ని రంగాలను రిప్రెజెంట్‌ చేస్తూ దాన్ని డిజైన్‌ చేశారు. రెండు వారాల పాటు వివిధ రంగాల వారికి థ్యాంక్స్‌ చెప్తూ డూడుల్‌ను డిస్‌ప్లే చేస్తామని ప్రకటించిన గూగుల్‌ ఈ నెల 6న హెల్త్‌ వర్కర్లుకు, 7న డాక్టర్లు, నర్సులు, మెడికల్‌ వర్కర్స్‌కు, 8న ఎమర్జెన్సీ సర్వీస్‌ వర్కర్స్‌కు, 9న శానిటేషన్‌ వర్కర్లకు, 10న రైతులకు, 13న నిత్యావసరాలు రవాణా చేసే వారికి, 14న పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌కు, 15న డెలివరీ వర్కర్లకు, 16న ఫుడ్‌ సర్వీస్‌ వర్కర్లకు, 17న టీచర్లు, చైల్డ్‌ కేర్‌‌ వర్కర్ల కోసం, వారి సేవలను అభినందిస్తూ ప్రత్యేక డూడుల్స్‌ను ప్రెజెంట్‌ చేసింది. “ ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది. ప్రజలు గతంలో కంటే ఇప్పుడు ఒకరికొకరు సాయపడుతున్నారు. ప్రజలకు సాయం చేసేందుకు పనిచేస్తున్న ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు అందరికీ గూగుల్‌ థ్యాంక్స్‌ చెప్పాలనుకుంది. అందుకే డూడుల్‌ సిరీస్‌ను ప్రారంభించాము. ఈ రోజు వాళ్లందరికీ థ్యాంక్స్‌ చెప్పాలనుకుంటున్నాం” అని స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేసింది.