ప్రమాణ స్వీకారానికి జగన్ ఎంట్రీ ఇలా..

ప్రమాణ స్వీకారానికి జగన్ ఎంట్రీ ఇలా..

అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి నవ్యాంధ్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేేసేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. రేపు ఆయన విజయవాడ మున్సిపల్ స్టేడియంలో భారీస్థాయిలో హాజరయ్యే ప్రజలు, కార్యకర్తల నడుమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జగన్ ఎంట్రీ స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ తీసుకువచ్చేలా ప్రణాళికలు వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం చుట్టూ ఉన్న 20 గ్యాలరీలలో కూర్చునే ప్రజలకు…. అభివాదం చేస్తూ… జగన్ ఓపెన్ టాప్ వాహనంపై నిలుచుని వస్తారు. జగన్.. జగన్.. అనే నినాదాల హోరు మధ్య… జగన్ అభిమానులకు అభివాదం చేసుకుంటూ వస్తారు. తర్వాత ప్రధాన వేదిక ప్రాంగణానికి చేరుకుంటారు. తర్వాత.. ప్రత్యేక ఆహ్వానితులు, వీఐపీలు, అధికారులు కూర్చునే గ్యాలరీలలోకి ప్రత్యేక వార్డ్‌రోబ్ మీద నడుచుకుంటూ వెళ్లి అభివాదం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.