కాటారం, వెలుగు: గ్రామాల అభివృద్ధిపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం కాటారం ఎంపీడీవో ఆఫీస్లో గ్రామాల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని సూచించారు. ఆరుబయట వ్యర్థాలను కాలిస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం రూ.25 వేల జరిమానా విధించాలన్నారు.
అనంతరం మహాముత్తారం మండలంలోని మోడల్ పాఠశాలను కలెక్టర్ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గది, ఆహారాన్ని పరిశీలించారు. మహాముత్తారం పీహెచ్సీ సందర్శించి, వైద్యంపై ఆరా తీశారు. కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, డీపీవో నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.