
- సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు : బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే బంజారా కమ్యూనిటీ ఉద్యోగులకు ఈ సెలవు వర్తించనుంది. ఈ మేరకు ప్రత్యేక సీఎల్ మంజూరు చేస్తూ సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బంజారా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, గురువారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.