జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ప్రత్యేక కాలనీ : యూనియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్

జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ప్రత్యేక కాలనీ : యూనియన్ అధ్యక్షుడు  ఊదరి గోపాల్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులకు కాలనీ ఏర్పాటు చేయబోతున్నట్లు యానియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్ తెలిపారు. యూనియన్ ఆఫీసులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ద్వారా పర్మినెంట్, ఔట్‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగులకు ఫ్లాట్లు అందిస్తామన్నారు. యాదగిరిగుట్ట సమీపంలోని చల్లూరులో 220 ఎకరాల భూమి కొనుగోలు చేసి, అగ్రిమెంట్ పూర్తిచేశామన్నారు. చదరపు గజానికి రూ.3,999 ధర నిర్ణయించినట్లు చెప్పారు. డీటీసీపీ పర్మిషన్లు తీసుకుంటున్నామని, ముందుగా పర్మినెంట్ ఉద్యోగులు రూ.1తో మెంబర్‌‌‌‌షిప్ తీసుకోవాలని సూచించారు. త్వరలో భూమి చూపిస్తామన్నారు. అన్ని శాఖల ఉద్యోగులకు ప్రత్యేక కాలనీలు ఉన్నాయని, ఒక్క జీహెచ్ఎంసీ ఉద్యోగులకు లేకపోవడంతో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.