సుప్రీం కేసులపై తొలిసారి లోక్ అదాలత్

సుప్రీం కేసులపై  తొలిసారి లోక్ అదాలత్
  • రాష్ట్ర పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు చాన్స్​

హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టులో రాష్ట్రానికి చెందిన పెండింగ్‌‌‌‌ కేసులను తొలిసారిగా లోక్‌‌‌‌ అదాలత్‌‌‌‌ ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటు లభిస్తోంది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 3 వరకు లీగల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ అథారిటీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసులపై తొలిసారిగా ప్రత్యేక లోక్‌‌‌‌ అదాలత్‌‌‌‌ జరగనుంది.

అందుకు సంబంధించిన విషయాలను బుధవారం రాష్ట్ర లీగల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ అథారిటీ సభ్య కార్యదర్శి సీహెచ్‌‌‌‌ పంచాక్షరీ విలేకరులకు తెలిపారు. రాష్ట్రంలో మధ్యవర్తిత్వానికి అనుకూలంగా 295 కేసులు ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. అథారిటీ నుంచి వర్చువల్‌‌‌‌గా కక్షిదారులతో మధ్యవర్తిత్వంపై మాట్లాడుతున్నామని, ఇప్పటి వరకు 3 కేసుల్లో సంసిద్ధత వ్యక్తం చేశారని వివరించారు. ఎవరైనా వివరాల కోసం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 మధ్య 040–23446723 నంబర్‌‌‌‌ను సంప్రదించవచ్చునని వెల్లడించారు.