బస్తీ దవాఖానాల తనిఖీలకు ప్రత్యేక ఆఫీసర్లు : మంత్రి పొన్నం ప్రభాకర్

బస్తీ దవాఖానాల తనిఖీలకు ప్రత్యేక ఆఫీసర్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
  •      హైదరాబాద్ ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లా పరిధిలోని169 బస్తీ దవాఖానాల్లో అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు ప్రత్యేక ఆఫీసర్లను నియమించినట్లు జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. 

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల వంటి సీజనల్ వ్యాధులను సమర్థంగా నివారించేందుకు ఈ నెల10 నుంచి తనిఖీలు చేయనున్నట్టు పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో తాను కూడా పలు హాస్పిటళ్లను తనిఖీ చేస్తానని తెలిపారు.