దుబే ఎన్ కౌంటర్ పై ఎంక్వైరీకి స్పెషల్ ప్యానెల్

దుబే ఎన్ కౌంటర్ పై ఎంక్వైరీకి స్పెషల్ ప్యానెల్

లక్నో: గ్యాంగ్స్టర్ వికాస్ దుబేపై కాన్పూర్ లో ఆకస్మిక దాడి, ఎన్కౌంటర్ పై దర్యాప్తు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్కు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి శశికాంత్ అగర్వాల్ నేతృత్వం వహిస్తారని, రెండు నెలల్లో రిపోర్డు సబ్మిట్ చేస్తారని యూపీ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. గ్యాంగ్ స్టర్ దుబేతో లోకల్ పోలీసులకు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన సిట్ బృందం ఆదివారం కాన్పూర్ దగ్గరలోని బిక్రూ విలేజ్ను సందర్శించింది. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు హత్యకు గురైన స్పాట్ ను పరిశీలించింది. బిక్రూ గ్రామస్థులతో మాట్లాడి వికాస్ దుబే నేరాలు, అతనికున్న రాజకీయ సంబంధాలపై వాకబు చేసింది. దుబేను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన 16 మంది పోలీసుల టీంను గ్యాంగ్ స్టర్ రౌండప్ చేయడం వెనుక పోలీసులు, పొలిటీషన్ల పాత్ర ఉందన్న ఆరోపణలను పరిశీలిస్తామని, అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన తర్వాత ఈ నెలాఖరులోగా రిపోర్టును సమర్పిస్తామని అధికారులు మీడియాకు వెల్లడించారు. యూపీలోని కాన్పూర్ లో ఈ నెల 2 న జరిగిన 8 మంది పోలీసుల హత్య కేసులో ప్రధాన నిందితుడు వికాస్ దుబేను ఈ నెల 10 న పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.

సస్పెండ్ అయిన సబ్ ఇనిస్పెక్టర్ సుప్రీం కోర్టుకు

వికాస్ దుబేకు సమాచారమిచ్చాడన్న ఆరోపణలతో సస్పెండ్ అయిన సబ్ ఇనిస్పెక్టర్ కృష్ణకుమార్ శర్మ తనకు సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ ఆదివారం సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. చట్టవిరుద్ధ మార్గాల్లో తనను విధుల్లోంచి తొలగించవచ్చని పిటిషన్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో శర్మతో పాటు మరో ఇద్దరు పోలీసులు ఈ నెల 5న సస్పెండ్ అయ్యారు.

మ‌రిన్ని ఇక్క‌డ క్లిక్ చేయండి