పాస్పోర్ట్ స్పెషల్ డ్రైవ్.. స్లాట్ బుకింగ్ ఇక ఈజీగా

పాస్పోర్ట్ స్పెషల్ డ్రైవ్.. స్లాట్ బుకింగ్ ఇక ఈజీగా

కరోనా తర్వాత పాస్ట్ పోర్ట్ లకు మళ్లీ డిమాండ్ భారీగా పెరిగింది. దాదాపు మూడేళ్ల పాటు విదేశాలకు రాకపోకుల నిలిపివేయడంతో ఇంట్లోనే కూర్చున్న జనాలు.. మళ్లీ విదేశీ బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. దీంతో స్టడీ, జాబ్, టూరిస్టు వీసాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కరోనా తర్వాత పాస్ పోర్ట్ దరకాస్తు చేసుకుంటే కేవలం రెండు మూడు రోజుల్లోనే స్లాట్ దొరికేది. 

కానీ, ప్రస్తుతం.. ఒక స్లాట్ బుక్ కావడానికి 30 నుంచి 40 రోజుల టైం పడుతుంది. దీన్ని దృష్టిలో  ఉంచుకొని పాస్ పోర్ట్ సేవా కేంద్రం ప్రత్యేక డ్రైవ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. దీనివల్ల ఆఫీసుల చుట్టు తిరిగేవాళ్ల టైం సేఫ్ అవ్వడమే కాకుండా.. రద్దీ తగ్గడం, పాస్ పోర్ట్ పని తొందరగా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఏప్రిల్ 29 నుంచి ప్రతీ శనివారం పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు తెరిచి ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాటి ద్వారా 3,056 కొత్త స్లాట్లను విడుదల చేస్తారు. ఈ డ్రైవ్ వల్ల కొత్త వారితో పాటు.. ఎక్కువ రోజుల గ్యాప్ తో స్లాట్ బుక్ చేసుకున్నవాళ్లు రీ షుడ్యూల్ చేసుకోవచ్చు. 
 
పాస్ పోర్ట్ డ్రైవ్ లో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున.. హైదరాబాద్ సిటీలో బేంగంపేట్, అమీర్ పేట్, టోలీచౌకీ ప్రాంతాల్లో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. దరఖాస్తు చేసుకునేవాళ్లు ఏప్రిల్ 27, గురువారం సాయంత్రం 4 గంటల నుండి పాస్‌పోర్ట్‌ సేవా వెబ్‌సైట్ లేదా mPassportseva యాప్ ద్వారా అపాయింట్మెంట్ కోసం నమోదు చేసుకోవచ్చు.