
సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. శివాని నాగరం హీరోయిన్. జీఏ2 పిక్చర్స్‌తో కలిసి వెంకటేష్ మహా, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. శుక్రవారం హీరోయిన్ శివాని నాగరం పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌తో బర్త్ డే విషెస్ తెలియజేశారు మేకర్స్.
ఇందులో ఆమె పోషిస్తున్న వరలక్ష్మి క్యారెక్టర్ లుక్‌ను ఈ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. తన లుక్‌ను బట్టి పక్కింటి అమ్మాయి తరహా పాత్రను పోషిస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ కామెడీ డ్రామాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి పాత్రలో సుహాస్ నటిస్తున్నాడు. షూటింగ్ చివరిదశలో ఉంది. త్వరలో టీజర్ రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు తెలియజేశారు.