
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 15న రాత్రి 9 గంటలకు సూపర్‌లగ్జరీ బస్సు భద్రాచలంకు పంపిస్తున్నట్లు డీఎం రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుగు ప్రయాణంలో సమ్మక్క–సారలమ్మ, రామప్ప, వెయ్యి స్తంభాలు, భద్రకాళి అమ్మవారి ఆలయాలను దర్శించుకొని, తిరిగి 17న ఉదయం ఆర్మూర్ చేరుకుంటుందన్నారు. చార్జీ రూ.1,900 నిర్ణయించామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.