Mohini Ekadashi 2025: క్షీరసాగరాన్ని ఎందుకు చిలకాల్సి వచ్చింది.. పురాణాల్లో ఏముంది..

Mohini Ekadashi 2025:  క్షీరసాగరాన్ని ఎందుకు చిలకాల్సి  వచ్చింది.. పురాణాల్లో ఏముంది..

హిందువులు.. ఏకాదశి తిథికి ఎంత ప్రాధాన్యం ఇ స్తారో చెప్పనక్కరలేదు.  ప్రతి నెలలో  రెండు ఏకాదశి తిథిలు వస్తాయి.  అయితే వైశాఖమాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు.   ఈ ఏడాది మోహిని ఏకాదశి మే8 గురువారం వచ్చింది.    మోహిని ఏకాదశి పేరు ఎలా వచ్చింది.. ఆ పేరు వెనుక విశిష్టత ఏమిటి...  దీనికి సంబంధించిన పురాణ కథను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . 

పురాణాల ప్రకారం  ప్రతి ఏకాదశి రోజూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది.  తీరుతుంది. అలా వైశాఖ శుక్ల ఏకాదశి అంటే ‘మే 8’న వచ్చే ఏకాదశి తిథికి ‘మోహినీ ఏకాదశి’ అని పేరు.  క్షీర సాగరాన్ని  ఓ పక్క దేవతలు.. మరోపక్క రాక్షసులు  చిలికే సమయంలో  కౌస్తుభం, కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, హాలాహలం… లాంటివన్నీ ఉద్భవించిన తర్వాత చివరికి అమృతం వెలువడింది. 

 దేవతలు, రాక్షసులు ఇద్దరూ కూడా సమానమైన బలవంతులుగా ఉన్న సమయంలో  రాక్షసుల వలన దేవతలు.. మానవులు .. సమస్త లోకాలు చాలా బాధలకు గురవుతున్నాయి. వారిని ఎదుర్కొనే ధైర్యం దేవతలకు లేకపోయింది. దాంతో వారికి విష్ణుమూర్తి ఓ ఉపాయాన్ని సూచించాడు. క్షీరసాగరమథనం కనుక చేస్తే, దాని నుంచి అమృతం ఉద్భవిస్తుందనీ… అది సేవించిన దేవతలు మరణమనేది లేకుండా,రాక్షసుల  మీద పైచేయి సాధించగలరనీ చెప్పాడు. 

క్షీరసాగరాన్ని చిలికే ప్రక్రియలో దేవతలు.. రాక్షసులు సమానంగా  వారి పాత్రను పోషించారు.  ఆ సమయంలో అమృతాన్ని ఇద్దరూ పంచుకోవలసిన పరిస్థితి వచ్చింది.  దాని ప్రకారంగా వచ్చిన అమృతంలో సగభాగం రాక్షసులకు ఇస్తే  క్షీర సముద్రాన్ని చిలికిన ప్రయోజనం ఉండకపోగా.. రాక్షసుల వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని విష్ణుమూర్తి గ్రహించాడు.  ఆ సమయంలో విష్ణుమూర్తి స్వయంగా రంగంలోకిదిగాడని పద్మ పురాణంలో పేర్కొన్నారు. 

ఎంతో తేజస్సు కలిగిన విష్ణుమూర్తి ని చూస్తే ఎంతటివాడికైనా కళ్లు చెదిరిపోతాయి.  ఈ సమయంలో వైశాఖ మాసం శుక్ల పక్షం ఏకాదశి రోజున అందుకే తన  అందంతో మోహిని అవతారం..స్త్రీ వేషం  ధరించాడు.  ఆ సమయంలో అక్కడ ఉన్న స్త్రీ విష్ణుమూర్తేనని గ్రహించని రాక్షసులు.. తన అంద చందాలతో రాక్షసులను లోబరుకొన్నట్లుగా నటించి.. అమృతాన్ని దేవతలకు అందించి మాయమైపోయాడు.  ఇంకా విష్ణుమూర్తి అదే రూపంలో ఉన్నాడు.  సాక్షాత్తు పరమశివుడి మనస్సు కూడా చలించింది.  ఆ సమయంలో హరి హరులు కలిశారని.. అప్పుడు అయ్యప్పస్వామి జన్మించాడని పండితులు చెబుతున్నారు .   ఈ మోహినీదేవికి తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలి అనే ఊరిలో ప్రత్యేకమైన ఆలయం కూడా ఉండటం విశేషం

►ALSO READ | ఛార్ థామ్ యాత్ర : ఏ గుడిలో.. ఏ దేవుడిని దర్శించుకుని యాత్ర ప్రారంభించాలో తెలుసా..!

అందుకే వైశాఖమాసం అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. అందులోనూ ఆయనకు ప్రతిరూపమైన మోహినీదేవి అవతరించిన సందర్భం.  ఈ రోజున  ( మే8) విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఆత్మక్షోభ వరకు సకల బాధలకూ ఈరోజు చేసే ఏకాదశి వ్రతం ఉపశమనం కలిగించి తీరుతుంది. 

మోహినీ ఏకాదశి రోజు చాలామంది ముందు రోజు రాత్రి అంతే దశమి రాత్రి నుంచే ఉపవాసం మొదలుపెట్టి, మర్నాడు… అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారమూ తీసుకోకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం  ఉన్న  ఆరోగ్య పరిస్థితులను బట్టి, అంతటి కఠినమైన ఉపవాస ఆచరణ కష్టం కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకుండా పండ్లు, పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం చేయవచ్చు. ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ నిద్రించరాని శాస్త్రం. 

ఈ రోజు అభ్యంగన స్నానం చేయాలనీ, విష్ణుమూర్తిని ధూపదీపనైవేద్యాలతో పూజించాలనీ, ఉపవాసంతో రోజును గడపాలనీ, దానధర్మాలు చేయాలని పెద్దలు చెబుతారు. ఇవన్నీ కుదరకపోయినా… కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నం చేయాలి. తన మోహిని అవతారంతో ఎలాగైతే ఈ లోకానికి క్షేమంగా మారాడో… అలా మన కష్టాలన్నీ తీర్చమంటూ వేడుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.