కాచిగూడ – కాకినాడ మధ్య స్పెషల్ రైలు

కాచిగూడ – కాకినాడ మధ్య స్పెషల్ రైలు

హైదరాబాద్​లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కాచిగూడ నుంచి కాకినాడ టౌన్​ మధ్య స్పెషల్​ ట్రైన్​ నడపాలని నిర్ణయించారు. వన్​వే రైలు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ట్రైన్​లో ఏసీ 2 టైర్​, ఏసీ 3 టైర్​, స్లీపర్, జనరల్, సెకండ్​ క్లాస్​ కోచ్​లు ఉంటాయి. ఇటీవల రైలు ప్రమాద ఘటనలు విషాదాన్ని మిగల్చడంతో రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పటిష్టమైన రక్షణ వ్యవస్థతో కూడిన రైల్వే డిపార్ట్​మెంట్​ దిశగా అడుగు వేస్తున్నారు.

కాచిగూడ – కాకినాడ మధ్య త్వరలో ప్రారంభించబోయే ఈ రైలును.. ఏ తేదీ నుంచి నడుస్తుంది అనేది ఇంకా ప్రకటించలేదు అధికారులు. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ అతి త్వరలోనే వస్తుందని వెల్లడించారు రైల్వే అధికారులు.

ఇందులో భాగంగా అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. దీనితో పాటు శానిటేషన్ కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు కీలక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.