దీపావళి స్పెషల్ ట్రైన్స్.. సికింద్రాబాద్ నుంచి అన్రిజర్వుడ్ కోచ్లు

దీపావళి స్పెషల్ ట్రైన్స్.. సికింద్రాబాద్ నుంచి అన్రిజర్వుడ్ కోచ్లు

సికింద్రాబాద్: దీపావళి, ఛత్ పూజ్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్, బీహార్ లోని రాక్సాల్ మధ్య నాలుగు స్పెషల్ ట్రైన్స్ నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లలో 22 అన్ రిజర్వుడ్ సెకండ్ క్లాస్ బోగీలను ఏర్పాటు చేశారు. దాదాపు 2వేల 400 మంది సీటింగ్ సామర్థ్యంతో పాటు ఛార్జీల పొదుపు ఉంది. రోడ్డు రవాణా సంస్థతో పోలిస్తే జనసాధారన్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో 50శాతం తక్కువ. 

సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్ వైపు వెళ్లే వారికి ఈ  రైళ్తు ఉపయోగపడతాయి. ప్రయాణికులు అన్ రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్ మొబైల్ యాప్ ( UTS on Mobile) ద్వారా కొనుగోలు చేయొచ్చు.