హైదరాబాద్ నుంచి కటక్ కు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ నుంచి కటక్ కు ప్రత్యేక రైళ్లు

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.  ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ   హైదరాబాద్ టూ  కటక్ మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడపేందుకు సిద్ధమయ్యింది. ఇక్కడి వాల్టెయిర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎకె త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం, రైలు నెం. 07165 హైదరాబాద్ - కటక్ ప్రత్యేక రైలు జూలై  11, 18, 25 తేదీల్లో హైదరాబాద్‌లో  రాత్రి 8.10  గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం  09.05 గంటలకు ఇక్కడికి సమీపంలోని దువ్వాడ చేరుకుంటుంది. మరుసటి రోజు సాయంత్రం 5.45గంటలకు కటక్ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో రైలు నెం. 07166 కటక్-హైదరాబాద్ ప్రత్యేక రైలు జూలై  12, 19 మరియు 26 తేదీల్లో కటక్‌లో రాత్రి 10.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 07.35 గంటలకు దువ్వాడ చేరుకుని రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

Stoppages: Secunderabad, Nalgonda, Miryalaguda, Sattenapalli, Guntur, Vijayawada, Eluru, Rajahmundry, Samalkot, Annavaram, Anakapalle, Duvvada, Kothavalasa, Vizianagaram, Srikakulam Road, Palasa, Brahmapur, Khurda Road, Bhubaneswar and Cuttack.