
హైదరాబాద్లోని శృంగేరి శ్రీ శారదాపీఠంలో జగద్గురువులు, శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దర్శించుకున్నారు. శారదామాతను దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు బండి సంజయ్ తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణలో ముందుండాలని తనకు జగద్గురువులు సూచించారని ఆయన చెప్పారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా లింగన్నపేట వేద పాఠశాల రాధాకృష్ణ శర్మ, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి కూడా శారదాపీఠాన్ని దర్శించుకున్నారు.