
న్యూఢిల్లీ : స్పెషాలిటీ కెమికల్ కంపెనీ క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ వచ్చే నెల 3న ఇన్వెస్టర్ల ముందుకొస్తోంది. ఐదో తేదీన ఐపీఓ ముగుస్తుంది. ఒక్కో షేరుని రూ.129–136 ప్రైస్ రేంజ్‌లో అమ్మనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీఓ మే 31న ఓపెన్‌లో ఉంటుంది. రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్‌హెచ్‌పీ) ప్రకారం, క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ పబ్లిక్ ఇష్యూలో 95.7 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద అమ్మనుంది. కంపెనీ ప్రమోటర్లు జోగిందర్‌సింగ్ జస్వాల్, కేతన్ రమాని, ప్రితేష్ రమాని ఓఎఫ్‌ఎస్ కింద షేర్లను అమ్ముతున్నారు.
అప్పర్ ప్రైస్ బ్యాండ్ రూ.136 దగ్గర క్రోనాక్స్ రూ.130.15 కోట్లను సేకరించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 110 షేర్ల కోసం బిడ్స్ వేయాలి. ఈ కంపెనీకి వడోదర (గుజరాత్) లో మూడు మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లు, ఒక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, టెస్టింగ్ సెంటర్ ఉంది. కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి దహేజ్ (గుజరాత్) లో ల్యాండ్ సేకరించింది.