భద్రకాళి అమ్మవారి దేవాలయంలో కనుల పండువగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

భద్రకాళి అమ్మవారి దేవాలయంలో కనుల పండువగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

గ్రేటర్​ వరంగల్, వెలుగు: భద్రకాళి అమ్మవారి దేవాలయంలో బుధవారం వైభంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠామహోత్సవం కనుల పండువగా సాగింది.

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్​ బండ ప్రకాశ్, ఇరిగేషన్​ఎస్ఈ హరివెంకటరమ ప్రసాద్, ప్రముఖ వితరణశీల తొట్రెడ్డి హృదయ్ కుమార్ రెడ్డి, దేవాదాఖ శాఖ డిప్యూటీ కమిషనర్​ కృష్ణ ప్రసాద్, విష్ణువర్ధన్ రెడ్డి హాజరు కాగా, పుష్పగిరి పీఠాధిపతులు అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే దంపతులు భద్రఖాళీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.