
సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం, మంత్రుల కూర్పుపై వైసీపీ కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ నెల 30న ఏపీ కొత్త సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జగన్ తో పాటు.. ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనేదానిపై పలు రకాలుగా వార్తలొస్తున్నాయి. తాజాగా… జగన్ తో పాటు… 9 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది.
బొత్సా సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, పుష్పశ్రీ వాణి, గ్రంధి శ్రీనివాస్, పిల్లి సుభాష్ చంద్రబోస్, అవంతి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.
త్వరలోనే ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. ఇదే ఉత్సాహంలో.. ఆ ఎన్నికల్లోనూ గెలుపు జెండా ఎగరేయాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే… సీనియర్లతో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసి.. ఎన్నికలయ్యాక.. దానిని విస్తరించాలని ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.