రైల్వే సిబ్బంది పనితీరు అంచనాకు స్పీడో మీటర్​ యాప్ 

రైల్వే సిబ్బంది పనితీరు అంచనాకు స్పీడో మీటర్​ యాప్ 
  •     రైల్​ నిలయం నుంచి లాంచ్​ చేసిన ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్

సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్ల రాకపోకలు, భద్రతపై జీఎం అరుణ్ కుమార్ జైన్ సోమవారం సమీక్షించారు. సికింద్రాబాద్​రైల్ నిలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, పర్మినెంట్ వే మెయింటెనెన్స్ సిబ్బంది, రన్నింగ్ సిబ్బందికి క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు.

 ఈ సందర్భంగా స్పీడో -మీటర్ యాప్​ను అరుణ్​కుమార్​జైన్​ప్రారంభించారు. ఇది అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన అప్లికేషన్ అని, భద్రత, సమయపాలన, సిబ్బంది పనితీరును అంచనా వేస్తుందని తెలిపారు. కంప్యూటర్ రిపోర్లుల  అంచనాలో సహాయపడుతుందని చెప్పారు. లోకో కదలిక, వేగం ఇతర అంశాలను పర్యవేక్షించడంలో ఎంతో  ఉపయోపడుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని శాఖల ప్రధాన అధికారులు, అడిషనల్​ జీఎం ఆర్. ధనంజయులు  పాల్గొన్నారు.