కొన్ని సీజన్లలో కొన్ని రకాలు పండ్లు, కూరగాయలు కాస్తుంటాయి. సీజనల్ పండ్లు అయినా..కూరగాయలు అయినా ఖచ్చితంగా తినాలని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం వర్షాకాలంలో అనేక రకాలు పండ్లు, కూరగాయలు కాస్తుంటాయి. వాటిల్లో ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనం చేకూర్చేది బోడకాకరకాయ.
వర్షాకాలంలో బోడ కాకరకు మంచి డిమాండ్ ఉంటుంది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో 'ఆకాకరకాయ, బొంత కాకరకాయ అని కూడా పిలుస్తారు. ఈ కాకరకాయ రుచితో పాటు పోషకాలు కూడా అందిస్తుంది. అటవీ ప్రాంతాలతో పాటు దిగువ ప్రాంత రైతులు బోడ కాకరకాయలు అధికంగా పండిస్తున్నారు. బోడకాకరతో పులుసు, వేపుడు కూర, పొడి చేసుకుని భోజన ప్రియులు ఇష్టంగా తింటారు. ఈ బోడకాకరకాయల్లో రుచి మాత్రమే కాదు పోషక విలువలు, ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి.
ఇక బోడ కాకరకాయల గురించి తెలిసిన వాళ్ళు సీజన్ వచ్చిందంటే చాలు ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ బోడ కాకరకాయ కిలో 150 రూపాయలుపైన పలికినా.. దీనిని కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
బొడ కాకరతో ప్రయోజనాలు..
- బోడ కాకరలో పోషక విలువలతో పాటు ఔషధ విలువల మెండుగా ఉంటాయి.
- బోడకాకరతో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. అలాగే దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
- బోడకాకరలో ఫోలేట్స్ అధికశాతం ఉంటాయి. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది
- బోడకాకర గర్భిణీలు తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.
- బోడకాకరలోని కెరోటినాయడ్స్ కంటి సంబంధిత వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది.
- బోడ కాకరకాయ క్యాన్సర్ సహా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడగకుండా రక్షిస్తుంది.
- బోడకాకరలో ఉండే ఫ్లవనాయిడ్లు వయస్సు మీరి వచ్చే ముడతలను నియంత్రిస్తాయి.
- బోడ కాకరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
- బోడ కాకర కాయలు తినడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి.
- బోడ కాకరకాయలు శరీరంలోని కొవ్వును తగ్గించడానికి, బరువు తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి.
- బోడ కాకర కాయలు తింటే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయి.
- ఫైటో న్యూట్రిషన్ కలిగిన బోడ కాకరకాయ శరీరంనుండి నీరసాన్ని తగ్గిస్తాయి. ఇది రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది.
- బోడ కాకర కాయలలో ఫైబర్ ఉంటుంది. ఇది అజీర్ణాన్ని, మలబద్ధకాన్ని, గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యలను తగ్గిస్తుంది.
- బోడ కాకర కాయలు యాంటీ అలర్జీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి సీజనల్ వ్యాధుల నుంచి కాపాడతాయి.