
కరోనా భయంలోనూ 2021 స్పోర్ట్స్ ఫ్యాన్స్‌కు మస్తు మజా ఇచ్చింది. ఏడాది వాయిదా పడ్డ ఒలింపిక్స్ టోక్యోలో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. వైరస్ వల్ల రెండు పార్టులుగా సాగిన ఐపీఎల్ 14వ సీజన్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ క్రికెట్ అభిమానులను కనువిందు చేశాయి..! వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ సహా మరెన్నో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు కావాల్సినంత కిక్ ఇచ్చాయి. కొన్ని పోటీలు రద్దయినప్పటికీ.. జరిగిన ఈవెంట్లన్నీ మజా పంచాయి..! కొవిడ్ ముప్పు పూర్తిగా తొలగకున్నా.. వైరస్ కొత్త వేరియంట్స్ కంగారు పెడుతున్నా.. 2022 ఇయర్‌లో అభిమానుల కోసం పెద్ద పెద్ద పోటీలు రెడీగా ఉన్నాయి..! ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపే ఫిఫా వరల్డ్ కప్ ఈ ఏడాదే జరగనుంది..! వింటర్ ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ రూపంలో మల్టీ స్పోర్ట్స్ మెగా ఈవెంట్లు ముందున్నాయి..! అండర్19 వరల్డ్‌కప్, విమెన్స్ వన్డే వరల్డ్‌కప్, మెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లతో ఈ ఇయర్ క్రికెట్ ఫ్యాన్స్ కోసం ట్రిపుల్ ట్రీట్‌ఎదురుచూస్తోంది. కరోనా ముందు మాదిరిగా ఈ ఏడాది అంతా సాఫీగా జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..! 2022లో మేజర్ టోర్నీలతో కూడిన స్పోర్ట్స్ క్యాలెండర్ ఎట్లుందో చూద్దాం..!
వరల్డ్ ఈవెంట్స్
ఫిబ్రవరి 4–20 వింటర్ ఒలింపిక్స్ బీజింగ్
మార్చి 4–13 వింటర్ పారాలింపిక్స్ బీజింగ్
జులై 28–ఆగస్ట్ 8 కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్‌హామ్
సెప్టెంబర్ 10–25 ఏషియన్ గేమ్స్ హాంగ్జౌ
క్రికెట్
డిసెంబర్‑జనవరి23 సౌతాఫ్రికాలో ఇండియా టూర్ కంటిన్యూ (3 టెస్టులు, 3 వన్డేలు)
జనవరి 13‑మార్చి 20 రంజీ ట్రోఫీ
జనవరి 14‑ఫిబ్రవరి 5 అండర్‑19 క్రికెట్ వరల్డ్‌కప్ – వెస్టిండీస్‌లో
ఫిబ్రవరి 6‑20 ఇండియాలో వెస్టిండీస్ టూర్ (3 వన్డేలు, 3 టీ20లు)
ఫిబ్రవరి 25‑మార్చి 18 ఇండియాలో శ్రీలంక టూర్ (2 టెస్టులు, 3 టీ20లు)
మార్చి 4‑ఏప్రిల్ 3 విమెన్స్ వన్డే వరల్డ్‌కప్ – న్యూ జిలాండ్‌లో
ఏప్రిల్‑మే ఐపీఎల్ (షెడ్యూల్ ఖరారు కాలేదు)
జూన్ 9‑19 ఇండియాలో సౌతాఫ్రికా టూర్ (5 టీ20లు)
జులై 1‑17 ఇంగ్లండ్‌లో ఇండియా టూర్(3 వన్డేలు, 3 టీ20లు, 1 టెస్ట్*)
జులై‑ఆగస్ట్ వెస్టిండీస్‌లో ఇండియా టూర్(3 వన్డేలు, 3 టీ20లు)
సెప్టెంబర్ ఆసియా కప్ (షెడ్యూల్ ఖరారు కాలేదు)
అక్టోబర్ 16– నవంబర్ 13 ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ –ఆస్ట్రేలియాలో
నవంబర్ బంగ్లాదేశ్‌లో ఇండియా టూర్ (2 టెస్టులు, 3 వన్డేలు)
డిసెంబర్ ఇండియాలో శ్రీలంక టూర్ (ఐదు వన్డేలు)
బ్యాడ్మింటన్
జనవరి 11‑16 ఇండియా ఓపెన్
జనవరి 18‑23 సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్
జనవరి 25‑30 ఒడిశా ఓపెన్
మార్చి 1‑6 స్పెయిన్ మాస్టర్స్
మార్చి 8‑13 జర్మనీ ఓపెన్
మార్చి 16‑20 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్
మార్చి 22‑27 స్విస్ ఓపెన్
ఏప్రిల్ 5‑10 కొరియా ఓపెన్
ఏప్రిల్ 12‑17 కొరియా మాస్టర్స్ టోర్నీ
మే 17‑22 థాయ్‌లాండ్ ఓపెన్
జూన్ 7‑12 ఇండోనేషియా మాస్టర్స్
జూన్ 14‑19 ఇండోనేషియా ఓపెన్
జూన్ 30‑జులై 3 మలేసియా ఓపెన్
జులై 5‑10 మలేసియా మాస్టర్స్
జులై 12‑17 సింగపూర్ ఓపెన్
జులై 19‑24 తైపీ ఓపెన్
ఆగస్ట్ 30‑సెప్టెంబర్ 4 జపాన్ ఓపెన్
అక్టోబర్ 4‑9 యూఎస్ ఓపెన్
అక్టోబర్ 18‑23 ఇండోనేసియా సూపర్ సిరీస్
అక్టోబర్ 25‑30 ఫ్రెంచ్ ఓపెన్
నవంబర్ 1‑6 మకావు ఓపెన్
నవంబర్ 8‑13 హాంకాంగ్ ఓపెన్
నవంబర్ 15‑20 ఆస్ట్రేలియన్ ఓపెన్
నవంబర్ 22‑27 న్యూజిలాండ్ ఓపెన్
నవంబర్ 29‑డిసెంబర్ 4 చైనా ఓపెన్
డిసెంబర్ 14‑18 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్