క్రీడలతో ఒత్తిడి దూరం : అల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్ రెడ్డి

క్రీడలతో ఒత్తిడి దూరం : అల్ఫోర్స్ చైర్మన్  వి.నరేందర్ రెడ్డి

కొత్తపల్లి, వెలుగు: క్రీడలతో విద్యార్థుల్లో ఒత్తిడి దూరమవుతుందని అల్ఫోర్స్ చైర్మన్  వి.నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌‌‌‌‌‌‌‌లో బుధవారం ఖేల్ కీ జోష్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థులు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందుతారన్నారు. 

దీనిలో భాగంగా విద్యార్థులకు ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్, వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ, స్కిప్పింగ్, చెస్, క్యారమ్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు రేకుర్తి విజన్‌‌‌‌‌‌‌‌ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన వార్షికోత్సవానికి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరయ్యారు. క్రమశిక్షణతో చదివితేనే ఉజ్వల భవిష్కత్‌‌‌‌‌‌‌‌ ఉంటుందన్నారు. విద్యార్థులు చేసిన కల్చరల్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్సామ్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ రిటైర్డ్​ ప్రిన్సిపాల్​ మధుసూదన్​రెడ్డి, కరస్పాండెంట్​ ప్రసాద్, డైరెక్టర్​ వెంకట్, హెచ్ఎం రాజిరెడ్డి, పాల్గొన్నారు.