శాట్స్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో.. త్వరలో సీఎం కప్

శాట్స్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో.. త్వరలో సీఎం కప్

సికింద్రాబాద్​, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలనే లక్ష్యంతో మండల, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ పేరిట పోటీలు నిర్వహిస్తామని క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. త్వరలో సీఎం కప్ షెడ్యూల్ ని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ తెలంగాణ (శాట్స్‌‌‌‌‌‌‌‌) ఆధ్వర్యంలో అన్ని జిల్లాల స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లతో బుధవారం ఉన్నత  స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

శాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్, క్రీడా శాఖ చీఫ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా హాజరయ్యారు. సిటీలోని ప్రధాన స్టేడియాల్లో మైనర్ రిపేర్లను వెంటనే చేపట్టాలని, స్పోర్ట్స్ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌ను రూపొందించడంతో పాటు శాట్స్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మ్యాగజైన్, వెబ్ సైట్, యూట్యూబ్ చానల్ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.