
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు డైట్ కాలేజీల్లోని డీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్లతో భర్తీ చేయనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ నెల 19న సర్కారు కాలేజీల్లో, 20న ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ కౌన్సెలింగ్ ఉంటుందని ప్రకటించారు.
ఆయా తేదీల్లో ఉదయం10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో అటెండ్ కావాలని సూచించారు. అదే రోజు సాయంత్రం వరకు సీట్లు అలాట్ చేయనున్నట్టు చెప్పారు. కాగా, రాష్ట్రంలో భారీ వర్షాలు, సెలవుల నేపథ్యంలో ఎడ్ సెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో సీట్లు పొందిన అభ్యర్థుల రిపోర్టింగ్ గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్టు అధికారులు ప్రకటించారు.