నవంబర్ 27న పీజేటీఏయూలో స్పాట్ కౌన్సెలింగ్‌

నవంబర్ 27న పీజేటీఏయూలో స్పాట్ కౌన్సెలింగ్‌

గండిపేట, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్​ వర్సిటీకి అనుబంధం గా ఉన్న సైఫాబాద్ హోమ్ సైన్స్/ కమ్యూనిటీ సైన్స్ కాలేజీలో ఖాళీగా ఉన్న నాలుగేళ్ల బీఎస్సీ హోమ్ సైన్స్/కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 27న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాలేజీ అసోసియేట్ డీన్ డాక్టర్ వి.విజయలక్ష్మి ప్రకటించారు. 

టీఎస్‌ ఈఏపీసీఈటీ-2025లో అర్హత సాధించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ స్పాట్ కౌన్సెలింగ్ కు నేరుగా హాజరు కావొచ్చని తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాజేంద్రనగర్ లోని పీజేటీఏయూ ఆడిటోరియంలో కౌన్సిలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కోర్సు పూర్తి చేసిన వారికి మహిళా శిశు సంక్షేమ శాఖలో సీడీపీవో, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌, వైద్యారోగ్య రంగాల్లో డైటీషియన్ ఉద్యోగాలు, టెక్స్​టైల్స్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.