20 శాతం ఉద్యోగులను ఒకేసారి తీసేసిన మ్యూజిక్ యాప్

20 శాతం ఉద్యోగులను ఒకేసారి తీసేసిన మ్యూజిక్ యాప్

మిలియన్లకొద్దీ పాటలను అందిస్తున్న డిజిటల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ Spotify లేఆఫ్స్ ప్రకటించింది. ఈ ఏడాది(2023)లో మూడోసారి ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టింది. డిసెంబర్ లో 17 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు Spotify ప్రకటించింది. కంపెనీ నిర్వహణ, ఉత్పాదకత లక్ష్యంగా ఈ లేఆఫ్స్ లు ప్రకటించి నట్లు తెలుస్తోంది. 

కంపెనీ ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ కంపెనీ మ్యాన్ పవర్ ను తగ్గిస్తున్నట్లు  Spotify ఫౌండర్, సీఈవోడానియెల్ ఈకె తన ఉద్యోగులకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఆర్థిక వృద్ది మందగించడం, పెరిగిన మూలధన ఖర్చులవల్ల కంపెనీ ఉద్యోగులను తొలగింపులు చేపడుతున్నట్లు తెలిపారు. 

గతంలో ఉద్యోగాల తొలగింపు 

2023 లో ఇప్పటికే రెండు సార్లు లేఆఫ్స్ ప్రకటించింది మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ Spotify .జనవరిలో కంపెనీ ఉద్యోగుల్లో 6శాతం అంటే 600 మంది ఉద్యోగులను తొలగించింది. జూన్ లో 2 శాతం అంటే 200 మంది ఎంప్లాయిస్ ని తొలగించింది Spotify . 

ఎన్ని ఉద్యోగాలు పోతాయి? పరిహారం ఏంటీ? 

ప్రస్తుతం Spotify సంస్థలో 8వేల 800 మంది ఉద్యోగులున్నారు.. వారిలో కనీసం 1500 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని తెలిపారు. కంపెనీ రూల్స్ ప్రకారం..తొలగింపబడిన ఉద్యోగికి ఐదు నెలల జీతం చెల్లిస్తారని తెలిపింది. ఉద్యోగిని తొలగించినప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి సదుపాయాలు కొనసాగుతాయని తెలిపింది.ఉద్యోగులు తొలగించబడిన తర్వాత రెండు నెలల ఔట్ ప్లేస్ మెంట్ సర్వీస్ అందిచాల్సి ఉంటుందని  కంపెనీ సీఈవో తెలిపారు.