
కైరో: ఇండియా యంగ్ ప్లేయర్ అనహత్ సింగ్.. వరల్డ్ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో రెండోసీడ్ అనహత్ 6–11, 12–14, 10–12తో నాడియన్ ఎల్హమామి (ఈజిప్ట్) చేతిలో ఓడి కాంస్యం అందుకుంది. రెండు, మూడో గేమ్ ఆరంభంలో మంచి ఆధిక్యం చూపెట్టిన ఇండియన్ ప్లేయర్ దాన్ని కాపాడుకోలేకపోయింది. సొంత ఫ్యాన్స్ ముందు నాడియెన్ అద్భుతంగా పుంజుకుంది. 2010 తర్వాత ఈ టోర్నీలో సెమీస్ చేరిన రెండో ఇండియన్ ప్లేయర్‌గా అనహత్ రికార్డుకెక్కింది. అంతకుముందు దీపిక పల్లికల్ (2010) ఈ ఫీట్ సాధించింది.