శ్రావణమాసం 2025 : ఆదివారం ( ఆగస్టు3) ఈ పనులు అస్సలు చేయొద్దు.. కష్టాలు వెంటాడుతాయి..!

శ్రావణమాసం 2025 :  ఆదివారం ( ఆగస్టు3) ఈ పనులు అస్సలు చేయొద్దు.. కష్టాలు వెంటాడుతాయి..!

శ్రావణమాసం కొనసాగుతుంది. సండే అంటే చాలు .. జనాలు రిలాక్స్​ అవుతారు.. జనాలు ఎంజాయిమెంట్​ చేస్తున్నారు.  ఆదివారం సూర్యభగవానుడికి ఇష్టమైన రోజు.. అందులోనూ శ్రావణమాసం అంటే చాలా పవిత్రమైన నెల.. అందుకే  శ్రావణమాసం ఆదివారం ( ఆగస్టు3) కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు అంటున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం .. . 


పూర్వీకులు.. పండితులు తెలిసిన వివరాల  ప్రకారం శ్రావణమాసం  ఆదివారం రోజున కొన్ని పనులు అసలు చేయరాదని పండితులు చెబుతున్నారు. ఆదివారం  సూర్య భగవానునికి అంకితమైన పవిత్ర దినం. ఆయన మన కర్మలను నిత్యం గమనిస్తూ, ప్రతి ఒక్కరి జీవితం మీద ప్రభావం చూపుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి.

శ్రావణమాసం హిందువులకు ఎంతో పవిత్రమైన మాసం. హిందువులు ఈ నెలలో పూజలు.. వ్రతాలు.. నోములు చేస్తారు.  ఆదివారం సెలవు రోజు శ్రావణమాసంలో సండే రోజున ( ఆగస్టు 3)  ఎక్కువ సమయం ధ్యానంలో ఉండాలని.. అంతేకాక  పురాణాల ప్రకారం సూర్యభగవానుడిని పూజించాలని చెబుతున్నారు.   ఆదివారం సూర్యదేవునికి  అధిపతి. ఆయన భార్య ఛాయాదేవి, పిల్లలు శని, యముడు. అందువల్ల ఆదివారాన్ని గౌరవంతో గడపాలని, ఆ రోజున కొన్ని పనులను చేయకుండా ఉండాలని రుషులు సూచించారు.

 ఆదివారం అసలు చేయకూడని పనులు

  •  మద్యం సేవించకూడదు 
  •  మాంసాహారాన్ని తీసుకోరాదు 
  •  జుట్టు కత్తిరించడం, గోర్లు తొలగించడం వంటివి నివారించాలి
  •  భార్యతో శృంగార సంబంధానికి దూరంగా ఉండాలి 
  • సాత్విక ఆహారంతో, ధ్యానం, ప్రార్థనలు చేయాలి. 
  • ఎవరిని అవమాన పరచకూడదు. . అబద్దాలు ఆడకూడదు.

 
 చేయాల్సిన శుభ కార్యాలు: 

  • ఆదివారం ఆదిత్య హృదయాన్ని శ్రద్ధగా పఠించడం  లేదా వినడం...
  •  తెల్లరంగు పదార్థాలు దానం చేయడం (బియ్యం, పాలు, పెరుగు) 
  •  ఉప్పులేని వంటలు చేసి తినడం 
  • ప్రదోష కాలంలో రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన

ఆదిత్య హృదయానికి ఉన్న శక్తి..

 శ్రీరాముని కథే సాక్ష్యం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుడిపై యుద్ధానికి ముందుగా ముమ్మారు ఆదిత్య హృదయాన్ని పఠించి, దైవ అనుగ్రహంతో విజయం సాధించినట్టు వాల్మీకి రామాయణం చెబుతోంది. ఈ శ్లోకాన్ని ప్రతీ ఆదివారం పఠిస్తే గ్రహబాధలు, శని దోషాలు, యమ భయాలు తొలగిపోతాయని నమ్మకం. పండితుల అభిప్రాయం ప్రకారం, ఆదివారం రోజున ఈ నియమాలు పాటిస్తే ఆధ్యాత్మిక శాంతి, ఆరోగ్య పరిరక్షణ, పుణ్య ఫలితాలు లభిస్తాయి. కనుక సెలవు రోజు మద్యం, మాంసం ఎంజాయ్‌కి కాదు ... సూర్యారాధనకు అంకితం చేయాల్సిన పుణ్యదినంగా భావించాలని పండితులు చెబుతున్నారు. 

►ALSO READ | Vastu Tips: ఇంట్లో ఇనుప వస్తువులు ఎక్కడ ఉండాలి.. మెట్లకింద పూజ గది ఉంటే ఇబ్బందులు వస్తాయా..!

శ్రావణ ఆదివారం ఇలా చేస్తే శ్రీమహాలక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుందని పండితులు చెబుతున్నారు.  రుణబాధలు .. ఇతర ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ధన సంపాదన పెరగడంతో పాటు ఏ పని చేసినా కలసి వస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  సో ఎవరైన సండే స్పెషల్​ ఏంటి అని అడిగితే... సూర్యభగవానుడి ఆరాధన అని చెప్పండి...