
హిందువులు పాములను నాగేంద్రస్వామి దైవంగా భావించి పూజలు చేస్తారు. నాగేంద్రస్వామిని పూజించేందుకు నాగుల చవితి తరువాత నాగ పంచమి రోజున పుట్టలో పాలు పోసి.. ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శ్రీ విశ్వావశునామ సంవత్సరం (2025) లో నాగ పంచమి ఎప్పుడు వచ్చింది.. ఆరోజు ఏవిధంగా పూజ చేయాలి. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
శ్రావణ మాసంలో వచ్చే పండగలలో ఒకటి నాగ పంచమి. శ్రావణ శుక్ల పక్షం పంచమి తిథి ని నాగ పంచమి గా జరుపుకుంటారు. ఈ రోజున పాములను నాగేంధ్రస్వామిగా భావించి పూజిస్తారు. పాములు శివుడికి చాలా ప్రియమైనవి.
హిందూ మతంలో నాగ పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది (2025) నాగ పంచమి పండుగ మంగళవారం జూలై 29, 2025 నాడు వచ్చింది. ఆ రోజు నాగులను దేవుళ్లగా భావించి పూజిస్తారు. పాముకి పాలు సమర్పిస్తారు. అలాగే ఈ రోజున మహిళలు తమ కుటుంబాన్ని రక్షించమని కోరుతో ఉపవాసం ఉండి పూజలు చేస్తారు.
నాగ పంచమి 2025 తిథి ఏ రోజంటే..
- నాగ పంచమి జూలై 29వ తేదీ మంగళవారం
- పూజకు అనువైన సమయం: ఉదయం 5:41 నుంచి ఉదయం 8:23 వరకు
- వ్యవధి: 2 గంటల 43 నిమిషాలు
హిందూ మతంలో పాములను పవిత్రంగా భావిస్తారు. 12 మంది ముఖ్యమైన నాగులను ఆరాధించడం సంప్రదాయం. ఈ 12 మంది నాగులు శక్తి, జ్ఞానం, సంపద , రక్షణకు ప్రతీకలుగా విశ్వశిస్తారు.
- అనంత
- వాసుకి
- శేష
- పద్మ
- కద్రు
- తక్షక
- కాలీయ
- మణిభద్ర
- శంఖపాల
- అశ్వతార
- ధృతరాష్ట్ర
- శంఖచూడ
అనే ఈ 12 రకాల సర్పజాతిని నాగేంధ్ర స్వామిగా భావించి నాగ పంచమి రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో పుజిస్తారు.
నాగ పంచమి రోజు పఠించాల్సిన మంత్రం ఇదే..!
ఓం భుజంగేశాయ విద్మహే... సర్పరాజాయ ధీమహి...తన్నో ముక్తి నాగః ప్రచోదయాత్.
లేదా
సర్వే నాగాః ప్రియన్తాం మే యే కేచిత్ పృథ్వీతలే।
విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః
న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్।
అనే మంత్రాన్ని పఠించండి.
నాగ పంచమి రోజున ఏం చేయాలి?
- నాగ పంచమి రోజునే తెల్లారే స్నానమాచరించి, శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉపవాస దీక్ష తీసుకోవాలి.
- శివాలయానికి వెళ్లి మహాదేవుడిని బిల్వపత్రాలు, నీటితో అభిషేకించండి.
- ఆ రోజున ( జులై 29) ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడతో పామును తయారు చేయండి.
- సర్ప దేవతకు నీరు, పాలు, పెరుగు, పంచామృతం మొదలైన వాటితో స్నానం చేయండి.
- సర్ప దేవతకు బట్టలు, గంధం, బియ్యం, కుశ, దర్భలు, పువ్వులు, ఆభరణాలు మొదలైనవి సమర్పించండి.
- ధూపం, దీపాలు వెలిగించి పెరుగు, బియ్యం, పాలు, పువ్వులు, పండ్లు, స్వీట్లు మొదలైనవి సమర్పించండి.
- నాగ పంచమి కథ విని మంత్రాలను పఠించండి. నాగులకు హారతి ఇవ్వండి.
- శక్తి కొలదీ అవసరమైనవారికి దానం చేయండి లేదా బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వండి.