
హిందూ ధర్మంలో శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా శివయ్యకు ఈ మాసం పరమ ప్రీతికరమైనది. ఈ నెలలో శివుడిని పూజిస్తే, ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని నమ్మకం. పార్వతి దేవికి ఆకుపచ్చ రంగు ఇష్టమైన రంగు అని నమ్ముతారు. అందుకే ఆకుపచ్చ గాజులు, ఆకు పచ్చ బట్టలు ధరించి దేవతను పూజించడం వలన అంతులేని అదృష్టం లభిస్తుంది. దీని వెనుక ఉన్న అసలు కారణం ఎవరికీ తెలియదు. అటువంటి పరిస్థితిలో శ్రావణ మాసానికి ఆకుపచ్చ రంగుతో ఉన్న సంబంధం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
శివుడు - ఆకుపచ్చ రంగు
శివుడికి ఆకుపచ్చ రంగు ఎంతో ఇష్టమని పండితులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు శ్రావణ మాసంలో పూజలు.. నోములు.. వ్రతాలు చేస్తారు. ఆకుపచ్చ రంగు దుస్తులు... గాజులు ధరించడం వలన పరమేశ్వరుడి ఆశీస్సులు పుష్కలంగా లభించి.. భక్తుల కోరికలను నెరవేరుస్తాడని నమ్ముతారు., బుధుడు శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగును ధరించడం ద్వారా సంతోషిస్తాడు. భార్యాభర్తల జీవితంలో శ్రేయస్సును పెంచడానికి బుధుడు పనిచేస్తాడు.
తెలుగు మహిళలకు శ్రావణ మాసం ఎంతో ముఖ్యమైనది. త్వరలోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. పవిత్రమైన శ్రావణ మాసం శివుడికి అంకితం. ఈ మాసంలో వివాహిత స్త్రీలు ఆకుపచ్చని దుస్తులు, గాజులు ధరించి తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం ఆ భోలేశ్వరుడిని ప్రార్థిస్తారు
శ్రావణ మాసం ముఖ్యంగా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసంగా ప్రసిద్ధి చెందింది. శ్రావణ మాసంలో ఆకుపచ్చ గాజులు, దుస్తులు ధరించడం వల్ల కుటుంబంలో సంతోషం నెలకొంటుందని నమ్ముతారు. శ్రావణంలో చేసే వ్రతాలు, ఉపవాసాలు, పూజలు విశేష ఫలితాలనిస్తాయని పండితులు చెబుతున్నారు.