ఈసారి రామ్ చరణ్‌‌తో.. శ్రీలీల స్పెషల్ సాంగ్

ఈసారి రామ్ చరణ్‌‌తో.. శ్రీలీల స్పెషల్ సాంగ్

తనదైన ఎనర్జిటిక్ యాక్టింగ్‌‌తో వచ్చిన తక్కువ టైమ్‌‌లోనే ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది శ్రీలీల. ఓవైపు హీరోయిన్‌‌గా వరుస సినిమాలు చేస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్‌‌తోనూ ప్రేక్షకులను అలరిస్తోంది.  ఇప్పటికే ‘పుష్ప2’లో కిస్సిక్ అంటూ కుర్రకారును మెప్పించిన శ్రీలీల.. మరోసారి తనదైన స్పెషల్ డ్యాన్స్ మూమెంట్స్‌‌తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతోంది. ‘పుష్ప2’లో బన్నీకి  జంటగా స్టైలిష్ స్టెప్పులతో ఇంప్రెస్ చేయగా, ఇప్పుడు చరణ్‌‌తో కలిసి చిందేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు రూపొందిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌‌ను డిజైన్ చేశాడట డైరెక్టర్. 

ఈ పాట కోసం శ్రీలీలను సంప్రదించగా, తను ఓకే చెప్పిందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే  ఈ సాంగ్ చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది.  ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో  జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటిస్తుండగా, ఇప్పుడు శ్రీలీల రాకతో సినిమాకు మరింత అట్రాక్షన్ యాడ్ అవనుంది.  దీనిపై అఫీషియల్  అనౌన్స్‌‌మెంట్ రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రవితేజతో ‘మాస్ జాతర’ చిత్రంలో నటిస్తున్న శ్రీలీల.. తెలుగుతో పాటు కన్నడ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది.