నా డైలాగ్‌‌ డిక్షన్‌‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు: శ్రీవిష్ణు

నా డైలాగ్‌‌ డిక్షన్‌‌ని  చాలా ఎంజాయ్ చేస్తున్నారు: శ్రీవిష్ణు

శ్రీవిష్ణు హీరోగా కార్తిక్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘సింగిల్‌‌’.  కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్‌‌. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు.  అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా శ్రీవిష్ణు సినిమా విశేషాల గురించి ఇలా మాట్లాడారు.  

‘‘టైటిల్స్‌‌ మొదలు క్లైమాక్స్‌‌ వరకు ప్రేక్షకుల్ని నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. కథ వినగానే మంచి ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ అవుతుందని నమ్మకం కలిగింది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కథ, స్క్రీన్‌‌ ప్లేతో పాటు ఇంటర్వెల్ క్లైమాక్స్ కొత్తగా ఉంటాయి.  సీన్స్‌‌ అన్నీ మనల్ని మనం రిలేట్ చేసుకునేలా ఉంటాయి. యూత్‌‌కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది.  అలాగే ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా చూడొచ్చు. ఇది లవ్‌‌ స్టోరీ కనుక కథలోని ఫ్రెష్​నెస్‌‌కు తగ్గట్టుగా నా బాడీ లాంగ్వేజ్‌‌ ఉంటుంది. గత చిత్రాలతో పోల్చితే అది డిఫరెంట్‌‌గా ఉంటుంది.  ఇక నా డైలాగ్‌‌ డిక్షన్‌‌ని యూత్‌‌ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం నేను కూడా ప్రత్యేకంగా కేర్ తీసుకుని చేస్తున్నాను. వీలైనంతవరకు ప్రేక్షకుల్ని నవ్వించాలనేది నా ఉద్దేశం. నాతో పాటు సినిమా అంతా వెన్నెల కిషోర్ కనిపిస్తారు. మా ఇద్దరిలో ఎవరి క్యారెక్టర్ లేకపోయినా ఈ సినిమా లేదు. హీరోయిన్స్‌‌ ఇద్దరి పాత్రలను కూడా చాలా ఎంజాయ్ చేస్తారు.  క్లైమాక్స్  యూనిక్‌‌గా ఉంటుంది. సినిమాలోని హైపర్ ఎనర్జీకి తగ్గట్టుగా విశాల్ చంద్రశేఖర్ ఎనర్జిటిక్ సాంగ్స్ ఇచ్చారు. 

అలాగే వేల్ రాజ్ సూపర్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. సినిమా మొత్తం హైదరాబాద్‌‌లో తీసాం.  ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌‌ని ఇంత కొత్తగా ఎవరూ చూపించలేదు. చాలా బెస్ట్ మూమెంట్స్‌‌ని క్యాప్చర్ చేశాం.  నాకు హండ్రెడ్‌‌ పర్సెంట్‌ కాన్ఫిడెన్స్‌‌ ఉన్న  కామెడీ జానర్‌‌‌‌లో,  ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గీతా ఆర్ట్స్‌‌ బ్యానర్‌‌‌‌లో సినిమా చేయడం వెరీ హ్యాపీ.  ఇక నేను ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్లు అవుతోంది. ప్రస్తుతం ‘మృత్యుంజయ’ అనే థ్రిల్లర్‌‌‌‌లో నటిస్తున్నా. అలాగే ఒక ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్, ఓ ఫారెస్ట్ బ్యాక్‌‌డ్రాప్‌‌ మూవీలో నటిస్తున్నా. ఇక ఇన్నేళ్ల కెరీర్‌‌‌‌లో ఎక్కడ కూడా బోర్ కొట్టించని సినిమాలే చేశానని భావిస్తున్నాను. అయితే రానున్న  రోజుల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ రూపంలో ఓ పెద్ద రెవల్యూషన్ రాబోతోంది.  ఆ మార్పుకి నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి క్యారెక్టర్​లో ది బెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నా’’.