హను ప్రేమ కథలో..ఆరడగుల ప్రభాస్..అందాల శ్రీలీల!

హను ప్రేమ కథలో..ఆరడగుల ప్రభాస్..అందాల శ్రీలీల!

డైరెక్టర్ హనురాఘవపుడి(Hanuraghavapudi)  బెస్ట్ స్టోరీ టెల్లర్గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. అందాల రాక్షసి మూవీతో ఇంటెన్స్ లవ్ స్టోరీ తీసిన హను..రీసెంట్గా సీతారామం  వరకు అంతే ఇంటెన్సిటీ లవ్ ఎమోషన్ను తన మూవీస్లో క్యారీ చేస్తున్నారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తో హను రాఘవపూడి అదిరిపోయే కాన్సెప్ట్ను రెడీ చేశారని సమాచారం.ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా టాలీవుడ్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల( Sreeleela) నటించనున్నట్లు తెలుస్తోంది. ఆరడుగుల అందాగాడితో..ఈ అందాల బ్యూటీ నటించడం ఇది ఫస్ట్ టైం కాగా..ప్రభాస్ తో నటించడానికి మరి ఉత్సహంగా ఉందంట శ్రీలీల. ఈ మెస్మరైజింగ్ కాంబినేషన్ సెట్ అయితే ఫ్యాన్స్ కు పండుగనే చెప్పుకోవాలి. 

శ్రీలీల మూవీస్ విషయానికి వస్తే..

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల. ఇక ఈ బ్యూటీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది. దాదాపు 10 మూవీస్ లో నటిస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. రిలీజ్ విడుదలకు వరుసలో ఉన్న ప్రాజెక్ట్‌లు ..ఈ సెప్టెంబర్ లో స్కందతో వస్తుంది.  అక్టోబర్ లో భగవంత్ కేసరి, నవంబర్‌లో ఆదికేశవ లో కనిపిస్తుంది.

అలాగే జనవరిలో మహేష్ బాబు గుంటూరు కారం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా దాదాపు 10 చిత్రాల తర్వాత..ప్రభాస్ తో మరో భారీ చిత్రానికి సైన్ చేసింది. 

హను..ప్రభాస్ స్టోరీ విషయానికి వస్తే..

ఈ స్టోరీ ఆర్మీ బ్యాక్ డ్రాప్లో ఉండే ఇంటెన్స్..ఎమోషన్ లవ్ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. దిల్రాజు బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్.  అలాగే దసరా స్పెషల్గా ఈ మూవీకి సంబంధించి ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ వెలువడే అవకాశం ఉంది. వీరిద్దరి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ  హను ఫ్యాన్స్..ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. 
 
హను రాఘవపూడి..సీతారామం మూవీని ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ మూవీలో యాక్ట్ చేసిన దుల్కర్.. మృణాల్ ఠాకూర్ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. దీంతో మృణాల్ వరుస ఆఫర్స్తో బిజీ హీరోయిన్ గా మారింది. ఇక ప్రభాస్ తో  చేయబోయే ఈ చిత్రం ఎలాంటి కాన్సెప్ట్స్ తో రానుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

 ప్రసెంట్ ప్రభాస్ వరుస మూవీస్ తో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ తో సలార్ పార్ట్ 1, నాగ్ అశ్విన్ తో కల్కి. ఇక మరోపక్క మారుతి, సందీప్ వంగా మూవీస్ను లైన్ లో పెట్టేశారు. ఇక హను రాఘవపూడి మూవీ రిలీజ్ కావడానికి కనీసం రెండేళ్లు పట్టే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో హను రాఘవపూడి వెయిట్ చేస్తాడో..లేక అంతలోపు వేరే మూవీని డైరెక్ట్ చేస్తాడో చూడాలి మరి.