మేము మాట్లాడుకున్నప్పుడే మా మనసుకు తెలుసు.. పరిణీతి లవ్ నోట్

మేము మాట్లాడుకున్నప్పుడే మా మనసుకు తెలుసు.. పరిణీతి లవ్ నోట్

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా(Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chaddha) మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.  వీరి వివాహం నిన్న(సెప్టెంబర్ 24న) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది.

లేటెస్ట్గా వీరి పెళ్లి ఫొటోస్ను షేర్ చేస్తూ..ఫస్ట్ టైం బ్రేక్ ఫాస్ట్ తింటూ మేము మాట్లాడుకున్నప్పుడే మా మనసుకు తెలుసు..ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నామని. ఎట్టకేలకు మిస్టర్ అండ్ మిసెస్ కావడం ఆశీర్వాదం! ఇప్పుడు ఒకరినొకరు లేకుండా బ్రతకలేం..అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది పరిణితి. 

ఈ పెళ్లి వేడుకకు రాజకీయా నాయకులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో పాటుగా పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. కాగా  2023 సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో వీరి వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది. ఢిల్లీలో రాజకీయ నాయకుల కోసం, ముంబైలో సినీ ప్రముఖల కోసం  రిసెప్షన్ ప్లాన్  చేసినట్లుగా తెలుస్తోంది.  

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ప్రేమ పరిచయం ఎలా అంటే.. 

వీరి మధ్య పరిచయం లండన్‌లో ఏర్పడింది. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎకాన‌మిక్స్‌లో రాఘ‌వ్ చ‌ద్దా, ప‌రిణీతి చోప్రా క‌లిసి చ‌దువుకున్నారు. కామ‌న్ స్నేహితుల ద్వారా ఇద్దరి మ‌ధ్య ప‌రిచ‌యం మ‌రింత పెరిగింది. ఆ తర్వాత అది  ప్రేమ‌గా మారింది. ఈ ఏడాది  మార్చిలోనే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాగా  2022లో 33 సంవత్సరాల వయస్సులో రాఘవ్ చద్దా పంజాబ్ రాష్ట్రం నుంచి అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడిగా రాజ్యసభకు ఎంపికయ్యారు. పరిణీతి చోప్రా 24 సంవత్సరాల వయస్సులో 2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది.