ఇప్పుడేం చెప్పినా వర్కౌట్ కాదు.. ఇంటికెళ్లి ఎపిసోడ్స్ చూస్కో.. ఇచ్చిపడేసిన శివాజీ

ఇప్పుడేం చెప్పినా వర్కౌట్ కాదు.. ఇంటికెళ్లి ఎపిసోడ్స్ చూస్కో.. ఇచ్చిపడేసిన శివాజీ

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో మూడవ ఎలిమినేషన్ కూడా పూర్తయింది. ఈవారం దామిని(Damini) బయటికి వెళ్లగా.. వరుసగా ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం దామిని ఎలిమినేషన్ లో నటుడు శివాజీ(Shivaji) రెచ్చిపోయారు. ఇప్పుడేం చెప్పినా వర్కౌట్ కాదు.. ఇంటికెళ్లి ఎపిసోడ్స్ చూస్కో అంటూ దామినికి సాలిడ్ కౌంటర్ వేశారు. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఎలిమినేట్ అయిన దామిని బిగ్ బాస్ స్టేజి మీదకు వెళ్ళింది. అప్పడు ఆమె బిగ్ బాస్ ఇంట్లో ఆమె జర్నీ వీడియోను ప్లే చేశారు నాగార్జున. ఆ వీడియోలో శివాజీ శోభతో.. దామిని సేఫ్ గేమ్ ఆడుతోంది అని చెప్పడం దామినికి నచ్చలేదు. అది దాంతో కాస్త హార్ట్ అయిన దామిని.. శివాజీ గారు నేను సేఫ్‌ గేమ్ ఆడుతున్నానని మీరు శుభతో అన్నారు.. అలా అనడం కరెక్ట్ కాదు అని దామిని అన్నారు.. దానికి శివాజీ.. అమ్మా.. సేఫ్ గేమ్ అంటే నా ఉద్దేశం నువ్వు సొంత గేమ్ ఆడట్లేదని.. అంటూ క్లారిటీ ఇచ్చారు. దానికి దామిని.. మీరు కొంతమందితో మాత్రమే బాగుంటారు, వారినే పొగుడుతారంటూ అని చెప్పింది. ఆ మాటకి కాస్త హార్ట్ అయిన శివాజీ.. ఇప్పుడు నువ్వేం చెప్పినా వేస్ట్.. అవి వర్కవుట్ అవవు.. ఇంటికెళ్లి ఎపిసోడ్స్ మొత్తం చూసి ఇదే మాట చెప్పు.. అప్పుడు కూడా నాదే తప్పంటే.. నీకు సారీ చెబుతా అని అన్నారు శివాజీ. దీంతో శివాజి అన్న ఇచ్చిపడేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.

Also Read : దేవరకొండ ఐస్ బాత్.. సంథింగ్.. సంథింగ్ అంటున్న ఫ్యాన్స్..!