దేవరకొండ ఐస్ బాత్.. సంథింగ్.. సంథింగ్ అంటున్న ఫ్యాన్స్..!

దేవరకొండ ఐస్ బాత్.. సంథింగ్.. సంథింగ్ అంటున్న ఫ్యాన్స్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda)కు యూత్ లో ఎంత క్రేజ్ ఉందొ.. సోషల్ మీడియాలో అంతకు ముంది క్రేజ్ ఉంది. అందుకే అయన చేసే చిన్న పోస్ట్ అయినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆదివారం ఉందయం కూడా ఆలాంటి పోస్ట్ ఒకటి పెట్టాడు విజయ్. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇంతేకా ఆ పోస్ట్ ఏంటంటే.. ఆ పోస్ట్ లో విజయ్ ఒక తబ్ బాత్ లో కూర్చున్నాడు. కానీ ఆ తబ్ నిండా ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. ఆ ఫోటోను షేర్ చేస్తూ దానికి సండే మార్నింగ్స్ అనే క్యాప్షన్ ఇచ్చాడు. అది చుసిన ఫ్యాన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. అంత వేడి ఎందుకు భయ్యా? అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. సంతింగ్ ఈజ్ ఫిషీ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ అయితే.. నీ వేడికి ఐస్ కరిగిపోయేలా ఉంది అంటూ మరో కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Also Read : రామ్ చరణ్, రాజమౌళితో సినిమా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కంగనా

ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన పరుశురాం పెట్ల దర్శకతంలో ఓ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తరువాత జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో మరో సినిమా చేస్తున్నారు విజయ్. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా చేస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ రెండు సినిమాలి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.