తాతయ్యలతో చిందేసిన శ్రీలీల.. క్రేజీ వీడియో వైరల్

తాతయ్యలతో చిందేసిన శ్రీలీల.. క్రేజీ వీడియో వైరల్

శ్రీలీల(Sreeleela).. టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ అమ్మడు టైం నడుస్తోంది. ఏ ముహూర్తాన తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో తెలియదు కానీ.. ఒకే ఒక్క సినిమాతో వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. అది కూడా స్టార్ హీరోల సినిమాల్లో. ప్రెజెంట్ టాలీవుడ్ నుండి వస్తున్న టాప్ సినిమాలాంటిలో శ్రీలీలనే హీరోయిన్. అంతలా ఆడియన్స్ ను తనవైపుకు తిప్పికుంది శ్రీలీల. 

ఇక శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ. మెగా వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeleela (@sreeleela14)

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా శ్రీలీల కొంతమంది వృద్ధులతో డాన్స్ చేశారు. ఆదికేశవ సినిమాలోని లీలమ్మో అనే సాంగ్ కు వృద్ధులతో కలిసి నాగిని డాన్స్ చేశారు. ఆ వృద్ధులు కూడా శ్రీలీలతో కలిసి పోటాపోటీగా కాళ్ళు కదిపారు. ఈ వీడియోను శ్రీలీల స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.