శ్రీలీలకు క్రేజీ ఆఫర్

శ్రీలీలకు క్రేజీ ఆఫర్

టాలీవుడ్‌‌‌‌లో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్‌‌‌‌గా దూసుకెళుతోంది శ్రీలీల. ఇప్పటికే ఎనిమిది సినిమాల వరకూ చేస్తున్న ఆమెకు.. మరో రెండు క్రేజీ ఆఫర్స్ వచ్చినట్టు తెలుస్తోంది. అందులో ఒకటి అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప 2’. సుకుమార్ డైరెక్షన్‌‌‌‌లో రూపొందుతున్న ఈ మూవీలోని స్పెషల్ సాంగ్‌‌‌‌ కోసం శ్రీలీలను సంప్రదించినట్టు టాక్. ఫస్ట్ పార్ట్‌‌‌‌లో ‘ఊ అంటావా’ సాంగ్ పాన్‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌గా ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. శ్రీలీల మంచి డాన్సర్‌‌‌‌‌‌‌‌ అవడంతో ఇందులోని స్పెషల్ సాంగ్‌‌‌‌కు ఆమెను పర్ఫెక్ట్ యాప్ట్‌‌‌‌గా భావిస్తున్నారు. 

అయితే హీరోయిన్‌‌‌‌గా బిజీగా ఉన్న ఆమె.. ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌ను సున్నితంగా తిరస్కరించిందనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న చిత్రంలోనూ హీరోయిన్‌‌‌‌గా శ్రీలీల పేరు వినిపిస్తోంది. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌‌‌‌లో తెలుగ మ్మాయినే హీరోయిన్‌‌‌‌గా తీసుకుంటానని బుచ్చిబాబు అనడం.. అదే వేదికపై శ్రీలీల కూడా ఉండడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. మరి ఈ ఇద్దరు మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్స్‌‌‌‌ సినిమాల్లో ఏ సినిమాలో శ్రీలీల కనిపిస్తుందో చూడాలి!