డేంజర్ పిల్లగా మారిన శ్రీలీల

 డేంజర్ పిల్లగా మారిన శ్రీలీల

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో  శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్, రుచిర ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘ఎక్స్‌‌‌‌ట్రా’.  ‘ఆర్డినరీ మేన్’ అనేది ట్యాగ్‌‌‌‌లైన్. నితిన్‌‌‌‌కి ఇది 32వ చిత్రం. శ్రీలీల హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. ఇటీవల  నితిన్ ఫస్ట్‌‌‌‌లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేసిన మేకర్స్.. ఫస్ట్‌‌‌‌ సాంగ్‌‌‌‌కు ముహూర్తం పెట్టారు. 

ఆగస్టు 2న ‘డేంజర్ పిల్ల’ అంటూ సాగే పాటను విడుదల చేయనున్నట్టు కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌తో ప్రకటించారు. ఇందులో నితిన్, శ్రీలీల జంట ఆకట్టుకుంది. యాక్షన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రం 60 శాతం షూటింగ్ పూర్తయింది.   క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న సినిమా రిలీజ్ కానుంది.  హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.