
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌కి ఇది పదో సినిమా. గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దర్శకుడు హరీష్ శంకర్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, పరశురామ్ కెమెరా స్విచాన్ చేశాడు.
అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నాడు. ‘ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్. కొత్త లుక్‌తో శ్రీనివాస్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశాం. ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఇతర వివరాలను వెల్లడిస్తాం’ అని సాగర్ చంద్ర చెప్పాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను జూన్ రెండో వారం నుంచి మొదలుపెట్టనున్నట్టు నిర్మాతలు చెప్పారు.