Prabhas Next Movie: సక్సెస్ సీక్వెల్ టార్గెట్‌లో ప్రభాస్.. బ్లాక్‌బస్టర్ అప్డేట్ ఇదే!

Prabhas Next Movie: సక్సెస్ సీక్వెల్ టార్గెట్‌లో ప్రభాస్.. బ్లాక్‌బస్టర్ అప్డేట్ ఇదే!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. గతేడాది 2025 జూన్లో రిలీజైన ఈ మూవీ రూ.1,100 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించింది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ పనులు కూడా సైలెంట్‌గానే జరుగుతున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్ని నాగ్ అశ్విన్ ఆల్రెడీ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది.

ఇక ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ సినిమాతో సంక్రాంతి బరిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా అనంతరం ప్రభాస్ ‘కల్కి-2’ షూటింగ్‌లో పాల్గొంటాడని సినీ వర్గాలు తెలిపాయి. అందుకు సంబంధించి ఫిబ్రవరిలో కొన్ని రోజులు ఆయన షూటింగ్కు కేటాయిస్తాడని వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, ఈ సీక్వెల్‌లో దీపికా పదుకొణె స్థానంలో మరో హీరోయిన్‌ను ఎంపిక చేసే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆమె స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు స్పిరిట్, ఫౌజీ, సలార్ 2 చిత్రాల్లోనూ ప్రభాస్ నటిస్తున్నాడు.

న్యూ ఇయర్ సందర్భంగా స్పిరిట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రావొచ్చని టాక్.  సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో ఫస్ట్ లుక్ అంటే కేవలం ఒక పోస్టర్ మాత్రమే కాదు. క్యారెక్టర్ మైండ్‌సెట్, సినిమా టోన్, హీరో యాటిట్యూడ్, కథలోని డార్క్ థీమ్.. ఇలా అన్నీ ఒక్క ఫ్రేమ్‌లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందుకే ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ ఒక షాక్ వేవ్ లాంటిదే అని భావించవచ్చు. 

‘స్పిరిట్’లో ప్రభాస్ ఓ రా అండ్ రెబల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన పాత్రలన్నిటికంటే పూర్తిగా భిన్నంగా, రియల్, రఫ్, డార్క్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ గా ఈ మూవీ ఉండబోతుందట. ఫస్ట్ లుక్‌లోనే ప్రభాస్ లుక్ ఇండియన్ సినిమాల్లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.