ఫస్ట్ లుక్ .. శ్రీరంగనీతులు

ఫస్ట్ లుక్ .. శ్రీరంగనీతులు

సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మ లీడ్ రోల్స్‌‌లో నటిస్తున్న చిత్రం ‘శ్రీరంగనీతులు’. వీఎస్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో బల్మూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. గురువారం తొలి ఏకాద‌‌శి సంద‌‌ర్భంగా ఈ మూవీ ఫ‌‌స్ట్‌‌లుక్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు మేక‌‌ర్స్‌‌. ఇందులో ముగ్గురూ ఇంటెన్స్ లుక్‌‌తో ఇంప్రెస్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

‘ఇదొక న్యూ ఏజ్ కామెడీ డ్రామా. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌ని ప్రకటిస్తాం’ అన్నారు దర్శక నిర్మాతలు. విరాజ్ అశ్విన్, తనికెళ్ల భరణి, గీతా భాస్కర్, శ్రీనివాస్ అవసరాల, దేవీ ప్రసాద్, సివిఎల్ నరసింహారావు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్థన్ రామేశ్వర్, అజయ్ అర్సాడ సంగీతం అందిస్తున్నారు.