వీడియో: కోహ్లీ గురించి అడిగితే వెళ్లిపోయేవాడు: గంభీర్‌ వ్యక్తిత్వంపై మండిపడ్డ శ్రీశాంత్

వీడియో: కోహ్లీ గురించి అడిగితే వెళ్లిపోయేవాడు: గంభీర్‌ వ్యక్తిత్వంపై మండిపడ్డ శ్రీశాంత్

భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ ల మధ్య గొడవ కొసాగుతూనే ఉంది. నిన్న(డిసెంబర్ 6) జరిగిన లెజెండ్స్ లీగ్ లో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ గంభీర్ వ్యక్తిగతం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. శ్రీశాంత్ చేసిన ఈ కామెంట్స్ లో విరాట్ కోహ్లీ గురించి మాట్లాడడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 
గంభీర్ కు సహచర ప్లేయర్లకు గౌరవం ఇవ్వడని.. బ్రాడ్ కాస్ట్ సమయంలో విరాట్ కోహ్లీ గురించి అడిగితే గంభీర్ సమాధానం చెప్పకుండా ఇంకేదో మాట్లాడేవాడని శ్రీశాంత్ ఆరోపించాడు. ఒక మ్యాచ్ లో ఆట కంటే ముందు ప్లేయర్లను గౌరవించడం ఎంతో ముఖ్యమని గంభీర్ కు ఆ లక్షణాలు లేవని ఈ మాజీ ఫాస్ట్ బౌలర్ గంభీర్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

గతంలో కోహ్లీ, గంభీర్ కు మధ్య గొడవ జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ లో వీరు కొట్టుకుకునేవరకు వెళ్లారు. ఇక శ్రీశాంత్ కూడా తక్కువేం కాదు. ఆటగాళ్లను రెచ్చగొట్టంలో ఈ మాజీ భారత బౌలర్ ముందే ఉంటాడు. 

లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా రెండో ఓవర్ లో శ్రీశాంత్ బౌలింగ్ లో ఓపెనర్ గంభీర్ తొలి రెండు బంతులను వరుసగా 6,4 కొట్టాడు. అయితే ఆ తర్వాత రెండు బంతులను శ్రీశాంత్ డాట్ బాల్స్ వేసి గంభీర్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు.గంభీర్ శ్రీశాంత్ వైపు కోపంగా చూస్తూ వెంటనే రియాక్షన్ ఇచ్చాడు. ఇంతలో శ్రీశాంత్ దగ్గరికి రావడంతో మాట మాట పెరిగిపోయింది. అంపైర్లు సర్ది చెప్పడంతో ఇన్నింగ్స్ కొనసాగింది.